Breaking News

అంబేడ్కర్ ఆశ‌య సాధ‌న‌కు ప్ర‌జా ప్ర‌భుత్వం కృషి

సామాజిక తెలంగాణే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వ అడుగులు

క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు


మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

భార‌త రాజ్యాంగ రూప‌కర్త డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్కర్ ఆశ‌య సాధ‌న‌కు ప్ర‌జా ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని,సామాజిక తెలంగాణే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వ అడుగులు వేస్తుంద‌ని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ అన్నారు. ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, పిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డిల ఆదేశాల మేరకు శ‌నివారం బాబాసాహెబ్ 69వ వ‌ర్థంతి సంద‌ర్భంగా జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ బి.ఆర్ అంబేడ్క‌ర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి తో కలిసి సత్యనారాయణ మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తితో సామాజిక న్యాయం, విద్యా, ఉద్యోగ అవకాశం, సమాన హక్కులు అందరికీ చేరేలా ప్రభుత్వం కృషి చేస్తుంద‌న్నారు. యువత అంబేద్కర్ ఆలోచనలను తెలుసుకుని, ఆయన చూపించిన విద్యాసాధన మార్గాన్ని అనుసరించి ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాన‌మని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించి ప్రతి పౌరుడికి అధికారం, హక్కులు కలిగేలా చేసిన మహానుభావుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఆయ‌న‌ చూపించిన మార్గం త‌మ‌ ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు. పేద, బలహీన వర్గాల అభివృద్ధే త‌మ‌ లక్ష్యమ‌న్నారు. ప్రతి ఇంటికి విద్య, ఆరోగ్యం, ఉపాధి అందేలా కృషి చేస్తామ‌న్నారు. అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టడమే ఆయనకు నిజమైన నివాళి అని మంత్రి తెలిపారు. భారత రాజ్యాంగ శిల్పిగా, సామాజిక న్యాయం కోసం అహర్నిశలు పోరాడిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలు అపారమని అన్నారు. సమాజంలో విద్యా, అవగాహన, హక్కుల గురించి ప్రజలకు అంబేద్కర్ అందించిన ప్రేరణ నేటికీ మార్గదర్శకమని చెప్పార‌న్నారు. బలహీన వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం సంకల్పబద్ధంగా పనిచేస్తుందన్నారు. అంబేద్కర్ కలలుగన్న సమాన సమాజ నిర్మాణం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిపిసిసి మాజీ కార్యదర్శి గంగు కృష్ణమూర్తి, మాజీ ఎంపీపీ గడ్డం యాక సోమయ్య, సహకార సొసైటీ మాజీ చైర్మన్ వీరమనేని యాకాంతరావు,జిల్లా పరిషత్ కోఆప్షన్ మాజీ సభ్యులు ఎండి మదర్, సేవాదళ్ రాష్ట్ర నాయకులు గుగ్గిళ్ళ ఆదినారాయణ, ఎస్సీ సెల్ మండల పార్టీ అధ్యక్షుడు గాదపాక భాస్కర్,ఎడవెల్లి సోమల్లయ్య, మండల కో ఆప్షన్ మాజీ సభ్యులు ఎండి సలీం, పాలకుర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కమ్మగాని నాగన్నగౌడ్, సలేంద్ర శీనువాస్ యాదవ్,పాలకుర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి పన్నీరు వెంకన్న, సీనియర్ నాయకులు అనుముల అంజి రావు, కాంగ్రెస్ పెనుగొండ రమేష్, మారం శ్రీనివాస్,ఎడవెల్లి కుమార్, ఎడవెల్లి నాగన్న, శ్రీధర్,వెంకటమ్మ, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.