Breaking News

మాణిక్ ప్రభు పాఠశాలలో చట్టాల అవగాహన•విద్యార్థుల్లో న్యాయ అవగాహన పెంపు••చట్టాలపై విద్యార్థులకు అవగాహన•

మన ప్రగతి న్యూస్ /జహీరాబాద్

జహీరాబాద్ మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మాణిక్ ప్రభు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సును సీనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ శ్రీమతి జి. కవిత దేవి నిర్వహించి విద్యార్థులకు ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించారు. సమావేశంలో మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి క్రమశిక్షణతో ఉండాలని, పెద్దలను గౌరవించాలని, చక్కగా చదువుకోవాలని, చదువుతోపాటు సాధారణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. విద్యార్థులు నిత్యజీవితంలో చిన్న చిన్న సమస్యలు ఎదురైతే వాటిని అధిగమించడానికి చట్టాలు తొడ్పాడుతాయని సూచించారు. బాలికల పట్ల, మహిళల పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తించిన, వారు కఠిన శిక్షలకు లోనవుతారని తెలియ జేశారు. విద్యార్ధినులకు గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ గురించి వివరించారు. కార్యక్రమంలో మోటార్ వాహనాల చట్టం, బాల కార్మిక నిరోధక చట్టం, బాల్య వివాహ నిర్ములన చట్టం, ఉచిత న్యాయసేవా సహాయంపై విద్యార్థులకు తెలియజేసారు. మీ చుట్టు బాల్య వివాహా బాధితులు, బాల కార్మికులు ఎక్కడైనా ఉన్నట్లు గుర్తిస్తే స్కూల్ ప్రిన్సిపాల్ కు నేరుగా గాని,1098 కి ఫోన్ ద్వారా గాని తెలుపవచ్చని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలియజేసారు. ఏ సమాచారం గురించి తెలుసుకోవాలనుకున్న మండల లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యాలయంను సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాది రుద్రయ్య స్వామి గారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య మరియు లీగల్ సర్వీసెస్ సిబ్బంది, పారాలీగల్ వాలంటీర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి