Breaking News

హైదరాబాద్‌లో హత్యల సంచలం

  • జవహర్‌నగర్‌లో రియల్టర్‌ను దారుణంగా హతమార్చిన దుండగులు

మన ప్రగతి న్యూస్ / కాప్రా ప్రతినిధి:

హైదరాబాద్ నగరంలో వరుస హత్యలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎటు చూసినా దాడులు, హింసాత్మక సంఘటనలు నమోదవుతున్న నేపథ్యంలో భద్రతపై ప్రశ్నార్థకాలు తలెత్తుతున్నాయి. తాజాగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. ఫోస్టర్ బిల్లాబాంగ్ పాఠశాల దగ్గరే నడిరోడ్డుపై దాడి కాప్రా మండలంలోని జవహర్‌నగర్‌లో సోమవారం ఉదయం రియల్టర్ వెంకట రత్నం (50)ను దుండగులు నడిరోడ్డుపైనే హతమార్చారు. ఫోస్టర్ బిల్లాబాంగ్ పాఠశాల సమీపంలో బైక్‌పై వెళ్తున్న రత్నాన్ని ముందుగా పొంచి ఉన్న నలుగురు దుండగులు ఆడుకున్నారు. ముందే ప్లాన్… ఛేజ్ చేసి వేటకత్తులతో నరికి, తుపాకీతో కాల్చి చంపారు. ప్రాంతస్థుల కథనం ప్రకారం రత్నం ఇంటి నుంచి బైక్‌పై బయలుదేరగానే దుండగులు వెంటపడ్డారు. కొంతదూరం ఛేజ్ చేసి రోడ్డుమధ్య అడ్డగట్టి దాడి చేశారు. మొదట వేటకత్తులతో తీవ్రమైన గాయాలు చేశారు. అనంతరం దగ్గర నుంచి తుపాకీతో కాల్పులు జరిపి పరారయ్యారు. రత్నం అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన స్థలంలో రక్తపాతం కనిపించడంతో పరిసర ప్రాంతంలో భయాందోళనలు ఏర్పడ్డాయి. రత్నం రౌడీషీటర్ గత జంట హత్య కేసులోనూ నిందితుడే: హతుడైన వెంకట రత్నం దులుపేట పోలీసుస్టేషన్ పరిధిలో రౌడీషీటర్‌గా నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. గతంలో సంచలనం సృష్టించిన జంట హత్య కేసులో కూడా ఆయన పేరు నిందితుల జాబితాలో ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. పాత కక్షలే కారణమై ఉండొచ్చు – పోలీసుల అనుమానం: ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలు, దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్నారు.
ప్రాథమిక సమాచారం మేరకు పాత విబేధాలే హత్యకు కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దుండగుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు ప్రారంభించారు. హైదరాబాద్‌లో భద్రతపై ప్రశ్నలు: ఇటీవలి కాలంలో నగరంలో వరుసగా దాడులు, హత్యలు చోటుచేసుకోవడంతో ప్రజల్లో భయం పెరుగుతోంది. రియల్టర్లు, వ్యాపారులు, వ్యక్తిగత కక్షల నేపథ్యంలో జరుగుతున్న హింసాత్మక సంఘటనలు భద్రతా పరిస్థితులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..