బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

లోయలో పడ్డ యాసిడ్ లారీ..8 గంటలు నరకం, డ్రైవర్ మృతి

మన ప్రగతి న్యూస్/ ములకలపల్లి:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి వేళ హైడ్రోక్లోరిక్ యాసిడ్ లోడ్తో వెళ్తున్న భారీ లారీ అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో లారీ క్యాబిన్లోనే చిక్కుకుపోయిన డ్రైవర్, సుదీర్ఘ రెస్క్యూ ఆపరేషన్ తర్వాత మృతి చెందినట్టు గుర్తించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ నుంచి పాల్వంచ వైపు వెళ్తున్న హైడ్రో క్లోరిక్ యాసిడ్ లారీ అర్ధరాత్రి సమయంలో ములకలపల్లి సమీపంలోని పాములేరు వాగు బ్రిడ్జి వద్ద అదుపుతప్పి ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాద తీవ్రతకు లారీ క్యాబిన్ నుజ్జునుజ్జయింది. దీంతో దాదాపు 8 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించి ఫైర్ (రెస్క్యూ టీంకు ) సమాచారం అందించారు. లోయలో పడటం లారీలో ప్రమాదకరమైన యాసిడ్ ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. సుమారు 8 గంటల పాటు రెస్క్యూ టీం శ్రమించి లారీని వెలికితీసే ప్రయత్నం చేసింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ క్యాబిన్లో నే ఇరుక్కుపోయారు. రెస్క్యూ రెస్క్యూ సిబ్బంది ఎంత ప్రయత్నించినప్పటికీ, లారీ నుజ్జునుజ్జు కావడంతో డ్రైవరు ప్రాణాలతో కాపాడలేకపోయారు. చివరకు అతడు మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలు (డ్రైవర్ నిద్రమత్తు, అతివేగం, లేదా సాంకేతిక లోపమా అనేది తెలియాల్సి ఉంది. లారీలోని యాసిడ్ లీకేజీ కారణంగా పరిసర ప్రాంతాలకు ఇబ్బంది కలగకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం