మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి
మండలంలోని నల్లబెల్లి గ్రామంలో ముగింపు ప్రచార సభలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూనా గ్రామం నల్లబెల్లి మండల కేంద్రాన్ని సంపూర్ణంగా అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేసి అభివృద్ధి పనులు చేపట్టాను అందులో 90 శాతం పనులు పూర్తిచేశాను,ఇంకా కావలిసిన అబివృద్ధి కోసం 5 కోట్ల నిధులను మంజూరు. చేసి నిల్వ ఉంచాను.ప్రస్తుత ఎమ్మెల్యే అసమర్థత వలన నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు సరిపడా నిధులు ఉన్నవి రెండు సంవత్సరాలుగా పనులు ఆపి నిధులు రద్దు చేసిండు.నల్లబెల్లి గ్రామా అభివృద్ధికి రూపాయి కూడా ఇవ్వని,కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎందుక ఓటువెయ్యాలి.నీ సొంత గ్రామ0 ఆమినాబాద్ ను కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశాను.సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా జరగకుండా అధికార కాంగ్రెస్ పార్టీ కుట్రలుచేస్తుంది.అధికారం,పోలీస్ లను అడ్డుపెట్టుకొని గ్రామాలలో ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నది రైతులకు యూరియా బస్తా ఇవ్వలేని ఆసమర్ధులకు ఈ ఎన్నికలలో బుద్ధి చెప్పాలి. ఐదు కోట్ల ప్రభుత్వ సొమ్ముతో ముఖ్యమంత్రిని నర్సంపేటకు పిలిచి వార్డు,సర్పంచ్ ఎన్నికల ప్రచారం నిర్వహించినారూ. గ్రామాల అభివృద్ధి గురించి కానీ,రద్దు చేసిన నిధుల గురించి గాని ముఖ్యమంత్రి ఒక్క మాటకూడా మాట్లాడలేదు .ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్, మండల పార్టీ అధ్యక్షుడు, పాక్స్ ఛైర్మెన్,మండల పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్,మాజీ ఎంపిటిసి, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు.


