మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి
మండలంలో జరగబోయే రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రజలకు ఎస్సై గోవర్ధన్ మార్గదర్శకాలు జారీ చేశారు. పోలింగ్ కేంద్రాల చుట్టూ 100 మీటర్లలో ర్యాలీలు, గుంపులు, ప్రచారం నిషేధం. వాహనాలు 200 మీటర్ల దూరంలో పార్క్ చేసి అనుమానాస్పద ఘటనల కోసం డయల్ 100 లేదా పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరగేలా ప్రజలు పోలీస్ కు సహకరించాలని ఎస్.ఐ. గోవర్ధన్ పిలుపునిచ్చారు.

