Breaking News

ఇన్సిడెంట్ ఫ్రీ న్యూ ఇయర్‌కు పోలీసుల కట్టుదిట్టమైన చర్యలు

  • మంచి వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలి : సీపీ సుధీర్ బాబు ఐపీఎస్

మన ప్రగతి న్యూస్ / మేడ్చల్ జిల్లా ప్రతినిధి :

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అన్ని విధాల భద్రతా చర్యలు తీసుకుంటున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. న్యూ ఇయర్‌ను ఇన్సిడెంట్ ఫ్రీ ఇయర్గా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాచకొండ పరిధిలోని పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లు, ఫామ్ హౌస్‌లు, వైన్ షాపులు, ఈవెంట్ ఆర్గనైజర్లతో కమిషనర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. డ్రగ్స్‌పై ఉక్కుపాదం
న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపడుతున్నామని కమిషనర్ తెలిపారు. నిషేధిత డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీజే, బాణసంచాపై నిషేధం ఆట్‌డోర్ ఈవెంట్లలో డీజేలకు అనుమతి లేదని, ఎలాంటి బాణసంచా కాల్చడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈవెంట్లలో అనుమతించిన పరిమితికి మించి ప్రేక్షకులను అనుమతించరాదని ఆదేశించారు. మైనర్లకు మద్యం అమ్మితే కఠిన చర్యలు పబ్‌లు, బార్లు, వైన్ షాపులు నిర్దేశిత సమయానికి తప్పనిసరిగా మూసివేయాలని, మైనర్లకు మద్యం విక్రయిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు వేడుకల సమయంలో మహిళలపై ఎలాంటి వేధింపులు జరగకుండా షీ టీమ్స్‌ను మోహరిస్తున్నామని తెలిపారు. ఫామ్ హౌస్‌లలో అసభ్యకర డ్యాన్స్ కార్యక్రమాలకు అనుమతి లేదన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, డ్రంకెన్ డ్రైవింగ్ చెక్‌లు డ్రంకెన్ డ్రైవింగ్ పరీక్షలను కట్టుదిట్టంగా అమలు చేస్తామని, మైనర్లకు వాహనాలు ఇచ్చే యజమానులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అధిక వేగం, బైక్ రేసులను అరికట్టేందుకు అర్థరాత్రి సమయంలో కొన్ని ఫ్లైఓవర్లను తాత్కాలికంగా మూసివేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి ఐపీఎస్, ఎల్‌బీనగర్ డీసీపీ అనురాధ ఐపీఎస్, మల్కాజిగిరి డీసీపీ సీహెచ్ శ్రీధర్ ఐపీఎస్, యాదాద్రి డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ ఐపీఎస్, ఎస్ఓటీ డీసీపీ రమణ రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్, విమెన్ సేఫ్టీ డీసీపీ ఉషారాణి తదితర అధికారులు పాల్గొన్నారు.

ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్