- కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్
మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి:
మండలంలో జనావాసాల్లో అనుమతులు లేకుండా నిర్మించిన సిమెంట్ రెడీ మిక్స్ కర్మగారాన్ని వెంటనే సంబంధిత శాఖ తొలగించాలని డిమాండ్ చేస్తూ నల్లబెల్లి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం మహాధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నల్లబెల్లి గ్రామ అధ్యక్షుడు బత్తిని మహేష్ మాట్లాడుతూ కస్తూరిబా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంలో విద్యను అభ్యసిస్తున్న బాలికలకు ఈ రెడీ మిక్స్ కర్మాగారం వల్ల వచ్చే దూలి తో అనారోగ్యం పాలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీతారామ చంద్రస్వామి ఆలయానికి కూతవేటు దూరంలో ఈ కర్మాగారం ఉండడంతో దేవాలయానికి వచ్చే భక్తులకు కర్మాగారం నుండి వచ్చే వ్యర్ధమైన ధూళితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. మరోపక్క చుట్టు పక్కల ఉన్న జనావాసాలకు సైతం ఈ రెడీమిక్స్ కర్మాగారం నుండి వచ్చే దూళి నుండి తీవ్ర అనారోగ్య ఇబ్బందులు ఎదురైనా పట్టించుకునే నాధుడు కరువయ్యారన్నారు. వెంటనే సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి ఈ సమస్యను వెంటనే పరిష్కరించడం తోపాటు జనాభాసాల మధ్య ఉన్న రెడ్మిక్స్ సిమెంట్ కార్మాగారాన్ని తొలగించి అటు విద్యార్థుల ప్రాణాలు కాపాడడంతోపాటు ఇటు పరిసరాలు ఉన్న జనావాసాలకు అనారోగ్యం పాలు కాకుండా కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ధర్నా విషయం తెలుసు కున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కాంగ్రెస్ శ్రేణులను శాంతింప చేశారు. అనంతరం గ్రామీణ సీఐ సాయి రమణ హామీ ఇవ్వడంతో కాంగ్రెస్ శ్రేణులు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో నల్లబెల్లి మండల కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ దండు సునీల్, కోల లింగయ్య, మాసంపల్లి ప్రభాకర్,పరికి పవన్,పరికి త్యాగరాజు,బత్తిని హరీష్, గాజు బిక్షపతి, గాజుల రాజేందర్,కన్నబోయిన సురేష్,ఎద్దు నరేష్, పోడేటి కిషోర్,దండు సునీల్, నాగెల్లి సుమన్,కుక్కముడి నాగరాజు, పోడేటి భాస్కర్, పవన్, కిరణ్, మేకల మోహన్,తదితరులు పాల్గొన్నారు.

