Breaking News

డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యం

-కరీంనగర్ సిపి గౌస్ ఆలాం.

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:

ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్

శంకరపట్నం మండలం కేంద్రంలో ఓ ప్రైవేట్ స్కూల్లో పోలీసు వారి ఆధ్వర్యంలో మండల స్థాయిలో వాలీబాల్ టోర్నమెంట్ సోమవారం ఘనంగా ముగిసింది.ఈ పోటీలో మండల పరిధిలోని 16 టీములు పాల్గొన్నవి. వాలీబాల్ టోర్నమెంట్ పోటీలో కేశవపట్నం ప్రథమ స్థానం లో,మొలంగూర్ రెండవ స్థానంలో,తాటికల్ మూడో స్థానంలో గెలుపొందారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కరీంనగర్ సిపి గౌస్ ఆలాం హాజరై క్రీడాకారులను అభినందించి,వారితో కాసేపు సరదాగా వాలీబాల్ ఆడారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కరీంనగర్ సిపి గౌస్ ఆలాం మాట్లాడుతూ డ్రగ్స్‌,గంజాయి రహిత సమాజం నిర్మించడం మనందరి బాధ్యత.జిల్లాను మాదక ద్రవ్యాల రహితంగా మార్చుదామని పిలుపునిచ్చారు.మాదక ద్రవ్యాల నివారణకు చట్టాలు కఠినంగా ఉన్నాయని,యంత్రాంగం పక్కా గా అమలు చేస్తుందన్నారు .మత్తుకు అలవాటు పడి విలువైన జీవితాన్ని పాడు చేసుకోవద్దని కోరారు.డ్రగ్స్‌పై పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలిపారు.మత్తు పదార్థాలకు ఎవరూ బానిసలు కావద్దని పిలుపునిచ్చారు.హుజురాబాద్ ఏసిపి మాధవి మాట్లాడుతూ ఎవరైనా గంజాయి,డ్రగ్స్‌ అక్రమ రవాణా,విక్రయం లేదా వినియోగం చేస్తూ కనిపించినట్లయితే 1908 టోల్‌ ఫ్రీ నెంబర్‌ లేదా డయల్‌ 100 కు వెంటనే సమాచారం అందించాలని కోరారు.సమాచారం ఇచ్చిన వారి వ్యక్తిగత వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రేని ఐపీఎస్ సోహమ్, హుజరాబాద్ రూరల్ సిఐ పులి వెంకట్ గౌడ్, కేశవపట్నం ఎస్ఐ శేఖర్ రెడ్డి,వివిధ గ్రామాల క్రీడాకారులు,మాజీ,తాజా ప్రజా ప్రతినిధులు, మండల పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు,విద్యార్థిని తల్లిదండ్రులు పాల్గొన్నారు.