Breaking News

అసెంబ్లీ ని ముట్టడించిన మాజీ సర్పంచులు..

  • అరెస్టు చేసి పీఎస్ కు తరలించిన పోలీసులు..

మన ప్రగతి న్యూస్/నడికూడ:

పెండింగ్ బిల్లులు విడుదల చేయాలంటూ.. రాష్ట్ర సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం నడికూడ మండల సర్పంచులు.. నడికూడ గ్రామ సర్పంచ్ ఊర రవీందర్ రావు, పులిగిల్ల మాజీ సర్పంచ్ పాలకుర్తి సదానందం, ముస్త్యాలపల్లి మాజీ సర్పంచ్ బొట్ల సంధ్యారవీందర్ లు అసెంబ్లీ ముట్టడిలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లా డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి, 2 సం”రా లైనా సర్పంచ్ ల పెండింగ్ బిల్లులు విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామా లను అభివృద్ధి చేసిన బిల్లులు మంజూరు చేయకుండా.. అక్రమ అరెస్టులు చేయడం సరైంది కాద ని, బిల్లులు అడిగితే పోలీసులతో గొంతు నొక్కడం అత్యంత దుర్మార్గమని, ప్రశ్నించే ప్రతి ఒక్కరినీ అరెస్టులు చేయడం అప్రజా స్వామికమని, ఇది ప్రభుత్వ లక్షణం కాద ని , అహంకార ప్రభుత్వానికి తగిన గుణ పాఠం చెబుతామని వారు హెచ్చరించారు.

ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్