పడిశాల వెంకన్న దళిత రత్న అవార్డు గ్రహీత…!!!
మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో :
ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణ పరిధిలో మాదిగ ఐక్యత చాటుతూ సోమవారం జరుగు ప్రపంచ మాదిగ దినోత్సవం సందర్భంగా టు కే రన్ ను విజయవంతం చేయాలని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడిశాల వెంకన్న మాదిగ… ( దళిత రత్న అవార్డు గ్రహీత) పిలుపునిచ్చారు మాదిగ ఐక్యత ఆధ్వర్యంలో జరిగే ప్రపంచ మాదిగ దినోత్సవం ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం జిల్లాలో మాదిగ మేధావులు, ఉద్యోగస్తులు, జర్నలిస్టులు, డాక్టర్లు, లాయర్లు, రాజకీయ నాయకులు యువ నాయకులు అధిక సంఖ్యలో ప్రపంచ మాదిగ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.. సోమవారం ఉదయం ఏడు గంటల నుండి టు కె రన్ బాబు జగ్జీవన్ రావు విగ్రహంనికి పూలమాలవేసి అక్కడ నుండి జడ్పీ సెంటర్ అంబేద్కర్ ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మాదిగ హక్కుల దండోరా అధ్యక్షులు డాక్టర్ కోరపల్లి శ్రీనివాసు మాదిగ విచ్చేయుచున్నారు.ప్రపంచ మాదిగల టు కె రన్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

