మన ప్రగతి న్యూస్/నడికూడ:
నడికూడ మండలం ముస్త్యాలపల్లి గ్రామంలోని మహమ్మద్ ఖాజా ఖాద్రి దర్గా యందు ఉర్సు షరీఫ్ అజాజ్ మదర్ షా వలి ఉత్సవాలకు పరకాల శాసన సభ్యు లు రేవూరి ప్రకాష్ రెడ్డి హాజరై, చాధర్ సమర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ముస్త్యాలపల్లి దర్గాకు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని పేర్కొన్నారు. ఉర్సు షరీఫ్ అజాజ్ మదర్ షావలి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసర మైన చర్య లు చేపట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత సామరస్యాన్ని కాపాడుతూ అందరికీ సమాన న్యాయం అందే లా చేస్తున్నామన్నారు. పరకాల నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. దర్గా పరిసర ప్రాంతాలను పరిశీలించి, దర్గా అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. అనంతరం ముస్త్యాలపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాల కు స్వచ్ఛ ఇవం హరిత్ విద్యాలయ రేటింగ్ (ఎస్ హెచ్ వి ఆర్) రాష్ట్ర స్థాయిలో సెలెక్ట్ అయిన సందర్భంగా ..పాఠశాల ప్రధానో పాధ్యాయులు కందుకూరి శ్రీనివాస్ ను ఎమ్మెల్యే రేవూరి శాలువాతో సన్మానించారు. ఎమ్మెల్యే వెంట ఎంపీడీవో ఆర్. రామకృష్ణ, డిప్యూటీ తహాసిల్దార్ సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్, నడికూడ సర్పంచ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కుడ్ల మలహాల్ రావు, ముస్త్యాలపల్లి సర్పంచ్ మేకమల్ల వెంకటేశ్వర్లు, నాయకులు పర్నెం మల్లారెడ్డి, ఈర్ల చిన్ని, వేణు చారి, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


