Breaking News

మున్సిపల్ ఆఫీసులో ఏసీబీ సోదాలు

  • అస్తవ్యస్తంగా రికార్డులు
  • 8 గంటల పాటు విచారణ

మన ప్రగతి న్యూస్ / జమ్మికుంట టౌన్ :

జమ్మికుంట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏసీబీ డిఎస్పి విజయ్ కుమార్ బృందం సోదాలను నిర్వహించారు. దాదాపు 8 గంటల పాటు కార్యాలయం తలుపులు మూసివేసి ప్రతి ఉద్యోగి దగ్గరి నుండి పూర్తి వివరాలు సేకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ మాట్లాడుతూకార్యాలయం లో లీవ్ రికార్డులు, ఇన్వర్డ్ రిజిస్టర్ లు సరైన పద్ధతిలో నిర్వహించడం లేదని, బిల్డింగ్ అనుమతులకు సంబంధించిన రిజిస్టర్ తో పాటు ఇన్ వార్డులో ఉన్న రిజిస్టర్ మరియు అవుట్ వార్డులో ఉన్న రిజిస్టర్లు సరిగా లేవని పేర్కొన్నారు. కోర్టుకు సంబంధించిన విషయాలలో మున్సిపల్ కార్యాలయం నుండి ఎవరు హాజరవుతున్నారని సమాచారం కూడా సరిగా లేదని బిల్డింగ్ అనుమతులకు సంబంధించిన వివరాలు సరిగా రిజిస్టర్లో పొందుపరచలేదని పేర్కొన్నారు. టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఎలాంటి రసీదులు లేకుండా ఉన్న 41,117 రూపాయలను స్వాధీనం చేసుకున్నామని వాటికి సంబంధించిన వివరాలు ఉద్యోగులు ఇవ్వలేదన్నారు.ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సదానందం ఫోన్ పే వివరాలు పూర్తిగా తెలుపలేదని అవి ఎక్కడినుండి వచ్చాయి ఎవరి దగ్గర నుండి వసూలు చేశారనే వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఫోను సైతం సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.మున్సిపల్ వాహనాల పై డీజిల్ ఖర్చు ఎక్కువగా వ్రాయడంతోపాటు ఉపయోగం లో లేని వాహనాల పై డీజిల్ ఖర్చులు వ్రాశారు వాటి పై విచారణ చేపట్టవలసి ఉందని వెల్లడించారు. పూర్తి వివరాలు రిజిస్టర్లు స్వాధీనం చేసుకొని వారం రోజుల తర్వాత తుది నివేదికను ఉన్నతాధికారులకు అందజేసి తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్