మన ప్రగతి న్యూస్ / ఏన్కూర్
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏన్కూరు మండలంలోని ప్రతి రైతుకు యూరియా సరఫరా జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి నరసింహారావు స్పష్టం చేశారు. యూరియా పంపిణీని కూపన్ విధానం ద్వారా క్రమబద్ధంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.మంగళవారం యూరియా కోసం వచ్చిన రైతులకు వ్యవసాయ శాఖ సిబ్బంది కూపన్లు జారీ చేసి, అందులో సూచించిన తేదీ, సమయంలో యూరియా బస్తాలు తీసుకోవాలని సూచించారు.మండల పరిధిలోని ప్రైవేటు డీలర్లు మరియు పీఏసీఎస్ (సహకార సొసైటీ) దుకాణాల్లో సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుత యాసంగి పంట కాలానికి అవసరమైన యూరియా సమృద్ధిగా ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ భరోసా ఇచ్చింది.

