మన ప్రగతి న్యూస్/ఉప్పల్ మేడ్చల్ జిల్లా స్టాపర్ :
ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉప్పల్ ఆర్టీవో కార్యాలయంలో ఏవో గా విధులు నిర్వహిస్తున్న ఆదూరి వెంకట కృష్ణారావు (59) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మంగళవారం ఉదయం సుమారు 10.30 గంటల సమయంలో నాగోల్ వాసవి బృందావనం నుంచి విధులకు వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై ఉప్పల్ ఆర్టీవో కార్యాలయా నికి వస్తుండగా.. రాజ్యలక్ష్మి యూ టర్న్ వద్ద వెనుక నుంచి వచ్చిన డీజిల్ ట్యాంకర్ (టి ఎస్ 08 యూజీ 9091) అతి వేగంగా, అజాగ్రత్తగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్యాంకర్ వాహనం కృష్ణారావు కుడికాలుపై నుంచి వెళ్లడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంట నే 108 అంబులెన్స్ సహాయంతో క్షత గాత్రుడిని కామినేని ఆసుపత్రికి తరలిం చారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం 6.30 గంటలకు కృష్ణారావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారిం చారు. ఈ ఘటనపై మృతుడి భార్య గాయత్రి దేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

