- సీతారామాలయంలో ఉత్తర ద్వారం ఏర్పాటు..
- వేకువ జాము నుండే పోటెత్తిన భక్త జనం..
మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి:
మండల కేంద్రంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరి గాయి. ధనుర్మాసం (పుష్య మాసం) ఏకాదశి వేడుకలను పురస్కరించు కొని స్థానిక శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో దేవాలయ అర్చకులు కొండా కృష్ణస్వామి ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం ముక్కోటి ఏకాదశి పర్వదినంగా భక్తులు ఆలయంలోని ఉత్తర ద్వారం ద్వారా శ్రీ సీతారామ చంద్ర లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి వారు లను దర్శించుకున్నా రు. వేకువ జాము నుండి మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల భక్తులు పోటెత్తడంతో దేవాలయం కిటకిటలాడింది. అనంతరం దేవాల య అర్చకులు ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా దేవతా మూర్తుల దర్శనాన్ని కల్పించారు. ప్రత్యేక పూజలతో పాటు దాతల సహకారంతో ప్రసాద వితరణ చేపట్టారు. గోవిందనామ, హరి నామస్మరణతో దేవాలయ ప్రాంగ ణం మారు మ్రోగింది. హిందూ ధర్మ ప్రచారక సభ్యులు, స్థానిక భక్తులతో పాటు పరిసర గ్రామాల భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.

