Breaking News

సంతోషాల నడుమ నూతన సంవ త్సర వేడుకలు జరుపుకోవాలి..

  • జిల్లా ఎస్పీ రోహిత్ రాజు..

మన ప్రగతి న్యూస్/ములకలపల్లి:

నూతన సంవత్సర వేడుకలు సంతోషాల నడుమ జరుపుకోవా లని జిల్లా ఎస్పీ. రోహిత్ రాజు అన్నారు. ఈ సందర్భంగా డీజేలు, అధిక శబ్దం వచ్చే బాక్స్ లు వినియోగిస్తే ఉపేక్షించేది లేదన్నా రు.మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారికి వాహనాలు ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న వేళ జిల్లా ప్రజలు ప్రశాంతమైన వాతవరణంలో వేడుకలను జరుపుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తరుపున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయ డం జరుగుతుందని తెలిపారు. డిసెంబర్ 31 రోజున జిల్లా వ్యాప్తం గా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనీఖీలు నిర్వహించబడుతాయని, నూతన సంవత్సర వేడుకల సంద ర్భంగా ఏర్పాటు చేసే ఎలాంటి కార్యక్రమాలు అయినా సరే నిర్వహ కులు తప్పనిసరిగా పోలీసు అధికా రుల నుండి ముందస్తు అనుమతు లు తీసుకోవాలని, అలాగే ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే విధంగా నిబంధనలకు విరుద్ధంగా డిజేలు ఉపయోగించరాదన్నారు. సైబర్ నేరగాళ్లు నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతో ఫోటోలు, మెసేజ్ లు పంపుతూ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న నగదును కాజే యాలని కొత్త కొత్త దారులు ఎంచు కుంటున్నారు. తెలియని వ్యక్తుల వద్ద నుంచి మెసేజ్ లు వస్తే ఓపెన్ చేయొద్దని ఎస్పీ సూచించారు. డిసెంబర్ 31వ తేదీన జిల్లా వ్యాప్తంగా డీజే లు నిషేధం. నిబంధనలు విరుద్ధంగా వినియో గిస్తే సీజ్ చేసి, కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం నేరం, వాహనాలు ఇష్టా నుసారంగా వేగంగా నడిపితే కేసు లు నమోదు చేయడంతో పాటు జైలు శిక్ష విధించబడుతుందని, ప్రభుత్వ, ప్రవేట్ ఆస్తులపై, రాళ్లు వేయడం, అద్దాలను పగలగొట్టడం, మహిళలను ఇబ్బంది పెట్టినా, అసభ్యంగా ప్రవర్తించినా వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుం టామని, మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, త్రిబుల్ రైడింగ్, సైలెన్సర్ లను తీసివేసి వాహనాలు నడపడం, శబ్ద కాలుష్యం చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడితే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుంద న్నారు. న్యూ ఇయర్ వేడుకలలో నిషేధిత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు ఉంటాయని, మద్యం దుకాణాలను నిర్ణీత సమయంలో మూసివేయాల ని,మైనర్లకు మద్యం అమ్మరాదని, బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ స్థలాల్లో మద్యం సేవిస్తే.. కేసు నమో దు అవుతాయని హెచ్చరించారు. పై ఆంక్షలను ఎవరైన అతిక్రమించి నా,ఉల్లంఘించినట్లుగా ప్రజల దృష్టికి వస్తే వెంటనే డయల్ 100 కు సమాచారం అందించడం ద్వారా తక్షణమే స్పందించి, వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతాయని, ఈ వేడుకలను ప్రజలు,యువత తమ ఇండ్లలోనే తమ కుటుంబ సభ్యుల తో కలిసి సంతోషకరమైన వాతావ రణంలో నిర్వహించుకోవాలని సూచించారు. అదేవిధంగా 2026 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి కలగాలని ఆశిస్తూ.. జిల్లా ప్రజలంద రికీ పోలీస్ శాఖ తరపున ఎస్పీ రోహిత్ రాజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్