Breaking News

పెన్షన్ కోసం పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న వృద్ధులు..

మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి:

నల్లబెల్లి మండల కేంద్రంలోని వివిధ గ్రామాలకు చెందిన వృద్ధులు, వికలాంగు లు ఆసరా పెన్షన్ కోసం పోస్ట్ కార్యాల యం చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన చెందుతున్నారు. నెల రోజులు గడిచినా ఇప్పటికీ పెన్షన్ జమ కాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు తెలిపారు. వృద్ధులు, వికలాంగుల జీవనాధారమైన ఆసరా పెన్షన్ ఆలస్యం కావడం వల్ల రోజువారీ అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి నెలకొందని ఆందోళ న వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభు త్వం స్పందించి, వెంటనే ఆసరా పెన్షన్ విడుదల చేయాలని బాధితులు కోరుతున్నారు.

ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్