-లక్కీ డ్రా లొ కార్ గెలుపొంద్దిన ఆరుర్ గ్రామ వాసి మన్నే రామకృష్ణ
మన ప్రగతి న్యూస్ /సదాశివపేట :
స్థానిక పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సాయి గణేష్ షాపింగ్ మాల్ లో వస్త్రాలు కొనుగోలుపై లక్కీ డ్రా కోపన్లు ఇవ్వడం జరిగింది. ఈ కోపన్లకు సంబంధించి గురువారం లక్కీ డ్రా నిర్వహించడం జరిగింది. ఈ లక్కీ డ్రా లో ఆరుర్ గ్రామానికి చెందిన మన్నే రామకృష్ణ టాటా టీయాగో కార్ గెలుపొందని మాల్ యాజమాన్యం తెలిపారు. ఈ సందర్భంగా గెలుపొందిన రామకృష్ణ మాట్లాడుతూ చాలా కాలంగా సాయి గణేష్ షాపింగ్ మాల్ లో షాపింగ్ చేస్తున్నాని, మాకు ఈ లక్కీ డ్రా ద్వారా కార్ రావడంతో చాలా సంతోషంగా వ్యక్తం చేశారు. అనంతరం షాప్ యజమాని కారు తాళాలు ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షాపు యజమాని రావుల పల్లి మల్లికార్జున్,మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింత గోపాల్, షాపింగ్ మాల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

