- డిసెంబర్ చివరి మూడు రోజుల్లో రూ.1000 కోట్ల మద్యం విక్రయాలు..
- డిసెంబర్ 30 న రూ.520 కోట్ల అమ్మకాలు..
మన ప్రగతి న్యూస్/ప్రధాన ప్రతినిధి:
నూతన సంవత్సరం సందర్భంగా తెలం గాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు భారీ గా నమోదయ్యాయి. డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో కలిపి మూడు రోజుల్లోనే సుమారు వెయ్యి కోట్ల రూపాయల విలు వైన మద్యం అమ్ముడైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ మూడు రోజుల్లో 8.30 లక్షల కేసుల లిక్కర్, 7.78 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఆరు రోజుల్లో మొత్తం రూ.1350 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 30 న రికార్డు స్థాయిలో రూ.520 కోట్ల అమ్మకా లు జరగగా, 31 న రూ.370 కోట్ల విక్ర యాలు నమోదయ్యాయి. తెలంగాణలో డిసెంబర్ మొదటి పదిహేను రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల కారణంగా కూడా మద్యం విక్రయాలు అధికంగా జరిగాయి. డిసెంబర్ నెలలో నూతన సంవత్సర వేడుకలతో పాటు పంచాయతీ ఎన్నికలు కూడా ఉండటంతో 2024 డిసెం బర్ తో పోలిస్తే మద్యం విక్రయాలు రూ. 1,349 కోట్లు అధికంగా జరిగాయి.

