- కనీస నీడకు దూరమైన మారమ్మ తల్లి..
- మరమ్మత్తులు చేపట్టాలని గ్రామస్తుల వేడుకోలు..
మన ప్రగతి న్యూస్/నడికూడ:
అమ్మవారికి తిప్పలు తప్పలేదు. నడికూ డ మండల కేంద్రంలోని గ్రామ దేవత శ్రీ మారమ్మ తల్లి గుడిలో ఇటీవలే అగ్ని కి ఆహుతైన ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు.. భక్తులు తల్లికి మొక్కులు చెల్లించుకోవడానికి ఆలయానికి వచ్చి దీపం వెలిగించగా, ప్రమాదవశాత్తూ ఆ మంటలు తల్లి చీరలకు అంటుకున్నాయి. దీంతో తల్లికి నీడగా ఉన్న పెద్ద వృక్షం కాలి కిందపడింది. ఈ ప్రమాదంలో తల్లి విగ్ర హం కూడా స్వల్పంగా దెబ్బతింది. గ్రామంలోని ప్రతి ఇంటిలో ఏ పండుగ జరిగినా మొదటగా మొక్కులు తీర్చుకునే గ్రామ దేవతకు ఈ సమస్య రావడంతో పలువురిని కంటతడి పెట్టింది. ఇప్పటి కైనా స్థానిక సర్పంచ్ చొరవ తీసుకొని.. ఆలయ మరమ్మత్తులు, విగ్రహ పునః ప్రతిష్ఠ చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.


