Breaking News

దట్టంగా కమ్మేసిన పొగమంచు.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు..

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:

శంకరపట్నం మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున 4 నుంచి ఉదయం 9 గంటలు దాటినా దట్టంగా మంచు కురుస్తూనే ఉన్నది. మండలాలకు వెళ్లే దారుల గుండా రాకపోకలు సాగించే వాహనదారులు, ప్రజలు నానా అవస్థలు పడ్డారు. పొగమంచు కారణంగా రోడ్లు కనిపించకపోవడంతో వాహనాలు మెల్లగా కదిలాయి.ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో లైట్లు వేసుకొని వెళ్లాల్సి వచ్చింది. పొగ మంచు కారణంగా 9 గంటల తర్వాత సూర్యుడు దర్శనం ఇచ్చాడు.ప్రధాన రహదారులు పంట పొలాల్లో ఎక్కడ చూసినా పొగమంచు పరుచుకొని అందమైన దృశ్యాలను మన ప్రగతి ప్రతినిధి కెమెరా లో బంధించారు.

ముద్రగడ పద్మనాభం మరణం పట్ల మాజీ మంత్రి పువ్వాడ సంతాపం