విభిన్న సేవ రంగాలలో రాణిస్తున్న
మల్లు గారి కుటుంబం
మల్లుగారి సేవా కార్యక్రమాలు చూసి బీసీ నాయకుడిగా గర్వపడుతున్న
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హన్మాండ్లు
మన ప్రగతి న్యూస్ /గంభీరావుపేట
అనేక మంచి సామాజిక కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్నన పొందుతున్న మల్లు గారు నర్సా గౌడ్ కుటుంబాన్ని చూసి బీసీ నాయకునిగా గర్వపడుతున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హన్మాండ్లు అన్నారు ఆదివారం రోజున గంభీరావుపేట మండల కేంద్రంలో గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా రికార్డు మెజారిటీ తో గెలిచిన మల్లు గారి పద్మ నర్సాగౌడ్లను రాజన్న జిల్లా బీసీ సంక్షేమ సంఘం పక్షాన శాల్వాలతో పూలమాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పర్ష హన్మాండ్లు మాట్లాడుతూ గంభీరావుపేట ప్రజలు మద్యం కు డబ్బులకు ప్రలోభ పడకుండా లొంగకుండా నిజాయితీగా ఓటు వేసి సర్పంచ్ గా మల్లుగారి పద్మ నర్సాగౌడ్ లను గెలిపించినందుకు ఇక్కడి ప్రజలకు పర్ష హన్మాండ్లు ధన్యవాదాలు తెలిపారు,మల్లు గారి నర్సాగౌడ్ ఆధ్యాత్మిక రంగంలో ప్రజాసేవలో వృద్ధుల అనాధాశ్రమం వంటి విభిన్న రంగాలలో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్నన పొందుతున్నారని వీరిని సన్మానించడం హర్షణీయం అని పర్ష హన్మాండ్లు అన్నారు, ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటే భవిష్యత్తులో తప్పకుండా ఒకే వేదిక లేదా ఒకే పార్టీలో కలిసి పనిచేస్తామని పర్ష హన్మాండ్లు అన్నారు ఈ సందర్భంగా మల్లు గారి నర్సాగౌడ్ మాట్లాడుతూ బీసీ బిడ్డగా రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి మెజార్టీ నిజాయితీ ఓట్లతో గెలిచిన సందర్భంగా పర్ష హన్మాండ్లు అభినందించి సన్మానం చేసినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అన్నారు దశాబ్దాల కాలం నుండి బీసీ సంక్షేమం పట్ల బీసీల హక్కుల కొరకు నాయకత్వం వహిస్తూ ఈ ప్రాంతంలో బీసీల ఎదుగుదలకు సహకారాన్ని కచ్చితంగా అందిస్తూ బీసీ బిడ్డలకు అండదండ గా ఉంటున్న బీసీ ఉద్యమ నేత పర్స హన్మాండ్లు అన్నారు ,భవిష్యత్ లో బీసీ హక్కుల కోసం కలిసి పోరాటం చేస్తామని నర్సాగౌడ్ అన్నారు, ఈ కార్యక్రమంలో సిరిసిల్ల బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు తడక కమలాకర్ ఎల్లారెడ్డిపేట మండల శాఖ అధ్యక్షుడు కంచర్ల రాజు ,నాయకులు అక్కపెళ్లి బాలయ్య, దేశెట్టి రాజశేఖర్ ,యువ నాయకులు నల్ల శ్రీకాంత్ ,గంభీరావుపేట బీసీ యువజన సంఘం అధ్యక్షులు ఎలక రాజు ,సందీప్ ,మహేష్ తదితరులు పాల్గొన్నారు

