మన ప్రగతి న్యూస్/ భూధాన్ పోచంపల్లి:
స్థానిక నగరపాలక సంస్థ లో ,సంస్థ పరిధిలోని వార్డులలో, అలాగే మండల పరిధి లోని గ్రామాలలో రైతులు ముమ్మ రంగ వరి నాట్లు వేస్తున్న తరుణంలో బీహార్, త దితర రాష్ట్రాలకు చెందిన యువకుల సైతం వరి నాట్లు వేయడం జరుగుతుంది. ఈ మేరకు మండల పరిధిలోని రామలింగంపల్లి గ్రామ శివారులో రైతు పొలంలో ఆయా రాష్ట్రాలను చెందిన యువకులు వరి నాట్లు వేయడం కనిపించింది. ఒక రామ లింగంపల్లిలోనే గాక, మండల పరిధిలోని ఆయా గ్రామాలలో సైతం రైతుల పొలాలను గుత్తకు తీసుకొని యువకులు చక చక వరి నాట్లు వేయడం జరుగు తుంది. ఈ ప్రాంతంలో కేవలం మహిళలు ,యువతులు మాత్రమే వరినట్లు వేస్తూ ఉండేవారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇతర రాష్ట్రాలకు చెందిన యువకులు సైతం వరి నాట్లు వేస్తున్నారు. మన దిక్కు యువత నాట్లు వేయాలంటే నా మూషి గా భావిస్తారు. ఇతర రాష్ట్రాలకు చెందిన యువత ఎలాంటి నా మూసి చెందకుం డా నాట్లు వేయడం జరుగుతుంది.

