Breaking News

ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సు

మనప్రగతిన్యూస్ /జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:

జోగులాంబ గద్వాల జిల్లా ఉద్యానశాఖ, తెలంగాణ ఆయిల్ ఫెడ్, మరియు సహకార శాఖల ఆధ్వర్యంలో గురువారం గొర్లఖాన్ దొడ్డి రైతు వేదికలో ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు
ఈ కార్యక్రమం ని ఉద్దేశించి జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎంఏ అక్బర్ మాట్లాడుతూ
ఆయిల్ ఫామ్ కోసం ప్రభుత్వాలు కోట్లాది రూపాయల విదేశీ మారకద్రవ్యాన్ని ఖర్చు చేస్తున్నందున దాన్ని తగ్గించుకునేందుకు ఆయిల్ ఫామ్ సాగుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాయన్నారు.
కొద్దిపాటి పెట్టుబడితో రైతులు ఎక్కువ శాతం సబ్సిడీతో ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వాలు సహకరిస్తున్నదని, ఆసక్తి ఉన్న రైతులు ముందుకు రావాలని కోరారు. ఇప్పటికే ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులు కూడా అధికారులతో తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
కావున రైతులు ఈ పంట ద్వారా వచ్చే ఆదాయాన్ని పొందుతూ సేద్యానికి పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి ఫ్యాక్స్ ఏ.ఏ.ఓ.ఆయిల్ ఫేడ్ జిల్లా ఇన్చార్జి మండల వ్యవసాయ అధికారి ఉద్యాన శాఖ డివిజన్ అధికారి మరియు గట్టు మండల ఆయిల్ ఫెడ్ ఫీల్డ్ ఆఫీసర్ ఆశోకవర్థన్ రెడ్డి, యశ్వంత్, మేఘనాథ్ అఖిల్ మరియు రైతులు పాల్గొన్నారు.

జన్నారం రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు