Breaking News

బాగున్నరా అమ్మ!

_రాష్ట్ర మహిళా మంత్రులకు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆత్మీయ పలకరింపు

మన ప్రగతి న్యూస్/గజ్వెల్ డివిజన్ ప్రతినిధి:

జన్నారం రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు

ఇంటికి వచ్చిన అతిథులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాదర ఆహ్వానం అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో ఆడబిడ్డలకు సంప్రదాయ సత్కారం తన ఇంటికి వచ్చిన రాష్ట్ర మహిళా మంత్రులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావు ఆత్మీయ ఆహ్వానం పలికారు.రాష్ట్ర దేవదాయ ధర్మదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పంచాయతీ రాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి సీతక్క గురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసారు.
మరికొద్ది రోజుల్లో,మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా,జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ ని ప్రభుత్వం తరఫున వారు ఆహ్వానించారు.ఈ సందర్భంగా,శాలువాకప్పి ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రులు కేసీఆర్ కి మేడారం ప్రసాదం అందజేశారు.ఈ సందర్భంగా… తన ఇంటికి వచ్చిన ఆడబిడ్డలను ఆత్మీయంగా పలకరించి సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్ శోభమ్మ దంపతులు,వారిని పసుపు కుంకుమ వస్త్రాలు, తాంబులాలతో సాంప్రదాయ పద్ధతిలో సత్కరించారు.కేసీఆర్ దంపతులు అందించిన తేనీటి విందు స్వీకరించిన మహిళా మంత్రులు, కాసేపు పరస్పర యోగక్షేమాలు, ఇష్టాగోష్టి అనంతరం మంత్రులు తిరుగు ప్రయాణం అయ్యారు.కాగా తొలుత,ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మహిళా మంత్రులకు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్,సాదర ఆహ్వానం పలికారు.