Breaking News

ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలి

-ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించటమే లక్ష్యం.
-జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

(మన ప్రగతి న్యూస్ కరీంనగర్ జిల్లా ప్రతినిధి)

విరిగిన విద్యుత్ స్తంభం.

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలోని ప్రభుత్వ పూర్వ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ సందర్శించారు.విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో చిన్నారులను చేర్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు.
ప్రీ ప్రైమరీ చిన్నారులకు యూనిఫామ్, పుస్తకాలు,స్టేషనరీ కిట్స్ ను అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కలెక్టర్ పమేల సత్పతి మాట్లాడుతూ జిల్లాలో 33 ప్రభుత్వ పూర్వ ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించామని తెలిపారు.నైపుణ్యం గల శిక్షణ పొందిన ఉపాధ్యాయులు నాణ్యమైన బోధనను అందిస్తారని అన్నారు.ప్రత్యేక సెలబస్ ద్వారా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే పూర్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు.ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత,నాణ్యమైన విద్య అందుతోందని యూనిఫాం,పుస్తకాలు వంటివి ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు.ప్రీ ప్రైమరీ చిన్నారులకు ఉచితంగా షూ అందజేస్తామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు,ప్రీ ప్రైమరీ స్కూళ్లలో పిల్లల నమోదు,హాజరు పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులు,ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు.మూడవ తరగతి విద్యార్థులతో పాఠాలు చదివించారు.రోజు చదవడం,రాయడం తప్పనిసరిగా అలవర్చుకోవాలని అన్నారు. ఉపాధ్యాయులు పాఠాన్ని చెప్పడమే కాకుండా విషయాన్ని అర్ధం చేయించడం చాలా ముఖ్యమని తెలిపారు. బుధవారం బోధనను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి,గ్రామ సర్పంచ్ సూరం స్వప్న,తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి,ఎంఈఓ శ్రీనివాస్,ఎంపీ డీ వో రాజీవ్ మల్హోత్రా,హెచ్ ఎం మంజుల తదితరులు పాల్గొన్నారు.