Breaking News

మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించాలి

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం లో జర్నలిస్టుల పాత్ర కీలకం

వనపర్తి జిల్లా ఎస్పీ సునీతా రెడ్డి

జిల్లా ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపిన టియుడబ్ల్యూజే
(ఐజేయు) నాయకులు

విరిగిన విద్యుత్ స్తంభం.

మన ప్రగతి న్యూస్ / వనపర్తి ప్రతినిధి :

యువత, విద్యార్థులు చెడు వ్యసనాల బారిన పడకుండా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి అన్నారు. శుక్రవారం
టీయుడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో ఇటీవల వనపర్తి జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సునీతారెడ్డి ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు యూనియన్ నాయకులతో పలు అంశాలపై జిల్లా ఎస్పీ చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సునీత రెడ్డి మాట్లాడుతూ.. ఎడ్యుకేషన్ హాబ్ గా ఉన్న వనపర్తి జిల్లాలో యువత చెడుదారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సమాజాన్ని, ప్రధానంగా యువత, విద్యార్థులను పట్టిపీడిస్తున్న గంజాయి, మాదక ద్రవ్యాలు కల్తీకల్లు, మద్యం తదితర మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై , బాల్య వివాహాల నియంత్రణపై పోలీసు శాఖ ప్రధానంగా దృష్టి సారిస్తుందని చెప్పారు. నార్కోటిక్స్, డ్రగ్స్ వంటి వాటిపై తాను గతంలో పనిచేసిన ప్రాంతాల్లో ఉక్కు పాదం మోపడం జరిగిందని వివరించారు. సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయని అలాంటి వాటి పట్ల మీడియా విరివిగా ప్రచారం చేసి అవగాహన కల్పించాలని కోరారు. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతోమంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. జిల్లాలో నేర నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. యువత, విద్యార్థులు చెడు వ్యసనాల బారిన పడకుండా సామాజిక బాధ్యతగా ఆరోగ్య సమాజ నిర్మాణంలో జర్నలిస్టులు కీలకపాత్ర పోషించాలని సూచించారు.
టీయుడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ మాట్లాడుతూ.. గతంలో రోడ్డు ప్రమాదాల నివారణ పై అవగాహన కల్పించడంతో పాటు యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు హెల్మెట్లు పంపిణీ చేయడం జరిగిందని, అదేవిధంగా భవిష్యత్తులో తమ యూనియన్ ఆధ్వర్యంలో మదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని అందుకు పోలీస్ శాఖ సహకారం తీసుకుంటామని అన్నారు. పోలీస్ శాఖ, జర్నలిస్టులు సమన్వయంతో పనిచేస్తూ నేర రహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ మెంబర్లు మల్యాల బాలస్వామి, ప్రశాంత్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ శ్రీనివాస్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాధవరావు, బి.రాజు, జిల్లా ఉపాధ్యక్షులు నాకొండ యాదవ్, గోపాల్, కోశాధికారి ద్వారపోగుమన్యం, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష, కార్యదర్శులు ఆంజనేయులు సాగర్, నరసింహారాజు, నియోజకవర్గ అధ్యక్షుడు విజయ్, టౌన్ అధ్యక్షుడు అరుణ్, యూనియన్ జిల్లా నాయకులు వెంకట్ గౌడ్, లక్ష్మణ్ ,తిరుపతయ్య, ఫారూఖ్ పటేల్, ధనుష్, రంగస్వామి, సురేష్, అరుణ్, చిన్న రాజు తదితరులు పాల్గొన్నారు.