Breaking News

వైభవంగా పాఠశాల లో ముందస్తు సంక్రాంతి వేడుకలు

మన ప్రగతి న్యూస్/ శంకరపట్నం:

హుజురాబాద్ మండల కేంద్రంలో వివేక్వర్ధిని మోడల్ స్కూల్ హైస్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలను ప్రిన్సిపల్ మేడిశెట్టి ప్రసాద్ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి.ముందస్తు వేడుకల్లో విద్యార్థులు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు తీర్చిదిద్దిన తీరు పలువురుని ఆకట్టుకున్నాయి.ఈ వేడుకలో విద్యార్థుల వేషధారణలతో హరిదాసుల కీర్తనలు,పిండి వంటల తయారీ,వ్యవసాయ పనులు బొమ్మల కొలువులతో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనల కన్నుల పండుగ నిర్వహించారు. ప్రిన్సిపల్ మేడిశెట్టి ప్రసాద్ మాట్లాడుతూ మన పండుగల విశిష్టతను విద్యార్థులకు తెలియజేసేందుకే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.సంక్రాంతి వచ్చిందంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు.ఈ వేడుకల లో పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విరిగిన విద్యుత్ స్తంభం.