సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి
కార్మిక హక్కుల్ని హరించే లేబర్ కోడ్ లను రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి డిమాండ్ చేశారు.శనివారం పాలకుర్తి మండలంలోని బొమ్మర, పెద్ద తండా గ్రామాలలో సిఐటియు కార్మికుల గ్రామ సమన్వయ కమిటీ సమావేశం పెంతల బిక్షం అధ్యక్షతన నిర్వహించగా కాసు మాధవి ముఖ్య సేవ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వేతనాల కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, సామాజిక భద్రత కోడ్, వృత్తిపరమైన భద్రత ఆరోగ్యం పని పరిస్థితుల కోడ్ పేర్లతో తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను కేంద్ర ప్రభుత్వం కార్మికులు నెత్తిన రుద్దడం దుర్మార్గమైన చర్య అన్నారు. దేశ ఉత్పత్తులో, సంపదలో కీలకపాత్ర పోషిస్తున్న కార్మిక వర్గం గత ఐదేళ్లుగా లేబర్ కోడ్ లను రద్దు చేయాలని అనేక రూపాల్లో పోరాటాలు, సమ్మెలు నిర్వహించిందన్నారు. అయినా ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు కొమ్ముగాస్తూ, కార్మికులను కట్టు బానిసలుగా మార్చుతుందన్నారు. పని గంటలు పెరగడంతో పాటు కార్మికుల జీవితాలు దుర్భరంగా మారిపోతాయి అన్నారు. కార్మికుల శ్రమను కారుచౌకగా దోచుకుంటూ రాయితీలు మాత్రం కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడం కేంద్ర ప్రభుత్వ దివాలుకోరుతనాననికి నిదర్శనం అన్నారు.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, కనీసవేతనాలు చెల్లించాలని, పనిభద్రత కల్పించాలనిడిమాడ్ చేస్తూ కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం పేరు మార్చడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులో, పథక నిర్వహణలో తన బాధ్యత నుండి తప్పుకోజూస్తుందన్నారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిరుగార్చే ప్రభుత్వ కుట్రను ప్రజలు, కార్మికులు ఐక్యంగా తిప్పికొట్టాల
న్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్యాల సోమన్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సోమసత్యం, నాయకులు తార, నాగమణి, వీరలక్ష్మి,రేణుక, శివవాణి, అరుణ, అశోక్, యకన్న, సోమన్న , రాజు, ముసుకు కోమల, స్వర్ణ లత, సులోచన, నరేందర్ తదితరులు పాల్గొన్నారు*.

