_ చిన్న, సన్నకారు రైతులు దరఖాస్తు చేసుకోవాలి..
_ ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
మన ప్రగతి న్యూస్ /
రాజన్న సిరిసిల్ల, జిల్లా స్టాపర్
సిరిసిల్ల జిల్లా నియోజకవర్గ వేములవాడ తిప్పాపూర్ లోని గోశాలలో కోడెలను పంపిణీ చేయనున్నట్లు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఒక ప్రకటనలో తెలిపారు. వేములవాడ తిప్పాపూర్ గోశాలలోని 300 కోడెలను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, పరిసర జిల్లాల రైతులు అర్హులని స్పష్టం చేశారు. కోడెల కోసం 1.5 నుంచి 5 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న సన్నకారు, చిన్నకారు రైతులు అర్హులని, వారు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన రైతులు పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డ్ మొదలగు సంబంధిత ధ్రువ పత్రాలతో ఈ వెబ్సైట్ https://rajannasircilla.telangana.gov.in/ లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న రైతులు దానికి సంబంధించిన పత్రాలతో ఈ నెల 21 వ తేదీన (బుధవారం) ఉదయం 09.00 గంటలలోగా వేములవాడ పరిధిలోని తిప్పాపూర్ గోశాలకు ఆధార్, పట్టాదారు పాస్ పుస్తకంతో రావాలని తెలిపారు. అర్హులైన రైతులకు మాత్రమే జియో ట్యాగింగ్ కలిగి ఉన్న కోడెలను పంపిణీ చేయనున్నామని స్పష్టం చేశారు. జియో ట్యాగింగ్ ఉన్న కోడెలు, వెబ్సైట్ లో రైతుల వివరాలు నమోదు చేయడంతో జీవాలు పక్కదారి పట్టే అవకాశం ఉండదని, భవిష్యత్తులో వాటి సంరక్షణను పరిశీలించవచ్చని స్పష్టం చేశారు. కోడెలను తీసుకువెళ్లే రైతులు వాటి సంరక్షణ బాధ్యతను సక్రమంగా పక్కాగా చూసుకోవాలని, వ్యవసాయ అవసరాలకే వినియోగించాలని సూచించారు. పక్కదారి పట్టినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్పష్టం చేశారు.

