మన ప్రగతి న్యూస్/ భూధాన్ పోచంపల్లి:
యాదాద్రి భువనగిరి జిల్లా చేనేత కేంద్రమైన భూధాన్ పోచంపల్లిలో బిజెపి చేనేత విభాగం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేనేత సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన రిలే నిరాహార దీక్ష 2వ రోజు శుక్రవారం నాడు కొనసాగింది. ఈ దీక్షలో వి భాగం జిల్లా అధ్యక్షుడైన గంజి బస్వలింగం తో పాటు భారత భూషణ్, జల్ది నర సింహ, రచ్చ సత్యనారాయణ, మరి కొంతమంది చేనేతలు దీక్షలో కూర్చున్నారు. ప్రభుత్వం ఎన్నికల ముందు చేనేతలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, చేనేత సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు.ఈ కార్యక్రమానికి ఆ పార్టీ నేతలు చిక్క కృష్ణ, డబ్బికార్ సాహెష్ , ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు చెరుకు వెం కటేష్ ,చేనేత జన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు చింతకింది రమేష్, స్థానిక చేనేత కార్మిక సంఘం మాజీ అధ్యక్షుడు శ్రీహరి తో పాటు పలువురు చేనేతలు పాల్గొన్నా రు.

