Breaking News

ప్రజలకు అందుబాటులో ఆధార్ సేవలు ..

  • ఎమ్మెల్యే రేవూరి..

మన ప్రగతి న్యూస్/నడికూడ:

ప్రజలకు అందుబాటులో ఆధార్ సేవలు నెలకొల్పబడిందని మండల ప్రజలు సద్వి నియోగం చేసుకోవాలని పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. శుక్రవారం నడికూడ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నం దు శాశ్వత ఆధార్ నమోదు కేంద్రాన్ని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారం భించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజలకు అవస రమైన సేవలు సులభంగా, సమయాను కూలంగా అందుబాటులో ఉండేలా చర్య లు తీసుకున్నట్లు తెలిపారు. నిర్వాహ కులు పుల్లూరు సునీల్ మాట్లాడుతూ.. నడికూడ మండల కేంద్రంలో శాశ్వత ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. మండల ప్రజా నీకం ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసు కోవాలని కోరారు. ఆధార్ లో మార్పులు, చేర్పులతో సహా.. ఆధార్ లేనివారికి నూతన ఆధార్ కార్డులను కూడా అందించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి, తహాసిల్దార్ రాణి లను.. నిర్వాహకుడు సునీల్ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తహాసిల్దార్ రాణి, మండల పార్టీ అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి,నడికూడ సర్పంచ్ కుడ్ల మలహాల్ రావు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పెద్దబోయిన రవీందర్ యాదవ్, పరకాల ఏఎంసీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, నాయకులు.. దురిశెట్టి చంద్రమౌళి, పర్నెం మల్లారెడ్డి, నూత న వార్డ్ మెంబర్లు, మండల, గ్రామ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

విరిగిన విద్యుత్ స్తంభం.