Breaking News

తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ విభాగం చైర్మన్ గా మానకొండూర్ ఎమ్మెల్యే నియామకం

మన ప్రగతి న్యూస్ /కరీంనగర్ జిల్లా స్టాఫర్:

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం చైర్మన్ గా నియమితులై శనివారం రోజున కరీంనగర్ వస్తున్న మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బెజ్జంకి క్రాస్ రోడ్ నుండి బైక్ ర్యాలీ తో గ్రామాల మీదుగా కరీంనగర్ వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,కార్యకర్తలు,ప్రజలు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు డప్పు చప్పుళ్ళతో,బాణసంచా పేల్చి ఎమ్మెల్యే కు గణస్వాగతం పలికారు.కోర్ట్ సర్కిల్ ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో కవ్వంపల్లి సత్యనారాయణ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు.అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ నాపై ఉంచిన నమ్మకంతో,విశ్వాసంతో,తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం చైర్మన్ గా నియమించిన సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి,ఏ ఐ సి సి అధ్యక్షులు కర్గే గారికి,రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.ముఖ్య మంత్రి నాకు ఏమి చూసి పదవి ఇచ్చినారో తెలీదు. ఇది నాకు పదవి కాదు,గౌరవం కాదు.ఇది దళితులకు సేవ చేసే బాధ్యత అని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.సేవ చేయాలనీ ఒక క్రూస్ రీడర్ గా నన్ను పంపించినారు.దళితులు మన రాష్ట్రంలో 70 లక్షల మంది ఉన్నారని అన్నారు.నేను అహర్నిశలు కష్టపడి దళితులకు సహాయ సహకారాలు అందజేస్తానని,దళితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రజలకు తెలియజేశారు.అనంతరం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,కార్యకర్తలు పూల మాలలతో,శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడి పల్లి సత్యం,సుడా చైర్మన్ కోమిటిరెడ్డి నరేందర్ రెడ్డి,మాజీ శాసన సభ్యులు కోడూరి సత్యనారాయణ గౌడ్,ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆరెపల్లి మోహన్,వర్కింగ్ ప్రసిడెంట్ పద్మాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతలు శ్రవణ్ నాయక్, తాజ్,సత్య ప్రసన్న,మంజుల,రజిత, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేష్, కాంగ్రెస్ పార్టీ నేతలు,కార్యకర్తలు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.