Breaking News

ఉప్పల్‌లో మాంజా ప్రమాదం

  • మెడకు లోతైన గాయం – సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు తీవ్ర గాయాలు

మన ప్రగతి న్యూస్ /ఉప్పల్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :

ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ సమీపంలో చైనా మాంజా ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సాయి వర్ధన్ రెడ్డి మెడకు మాంజా తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. మెడపై లోతైన గాయం కావడంతో అక్కడున్న స్థానికులు వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించగా ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. చైనా మాంజా వినియోగం వల్ల ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. మాంజా విక్రయం లేదా వినియోగంపై సమాచారం అందితే పోలీసులకు తెలియజేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉప్పల్ పోలీసులు హెచ్చరించారు.

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు