Breaking News

నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో రోడ్డు ప్రమాదం

ఇద్దరికీ తీవ్ర గాయాలు

మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు

నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామ పరిధిలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణంలో ఉన్న కారుకు అకస్మాత్తుగా టైరు పేలిపోవడంతో అదుపు తప్పిన కారు ముందుగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.