Breaking News

క్రికెట్ టోర్నమెంట్‌ ప్రారంభం..

మనప్రగతి న్యూస్/జగదేవపూర్ ప్రతినిధి:

సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండల పరిధిలోని లోని ఇటిక్యాల గ్రామంలో గ్రామ ఉప సర్పంచ్ ఎర్రోళ్ల నరేష్ ఏర్పాటు చేసిన క్రికెట్‌ టోర్నమెంట్‌ను మాజీ జెడ్పిటిసి లక్మారెడ్డి, మాజీ ఎంపిటిసి అయూబ్,మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ గుప్తా నూతన సర్పంచ్ దీన రాజలింగం లు పాల్గొని ప్రారంభిం చారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసీ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..
గ్రామీణ క్రీడాకారుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు గ్రామ స్థాయిలో నిర్వహించే ఆటల పోటీలు ఎంతగానో దోహద పడుతాయన్నారు.ఉప సర్పంచ్ ఎర్రోళ్ల నరేష్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఆటలు యువతలో మంచి క్రమశిక్షణను. ఐకమ త్యాన్ని పెంపొందించడంతోపాటు శారీరకంగా దృఢత్వాన్ని కలిగి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి.తమ గ్రామ క్రీడాకారులకు తన వంతు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రెసిడెంట్ నర్సోల్ల స్వామి , గ్రామ వార్డు సభ్యులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు