వ్యవసాయ అధికారికి వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ యువ నాయకులు
మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి:
మండలంలోని ఆగ్రోస్ కేంద్రాలను తెరిపించాలని వ్యవసాయ అధికారి బన్నా కి బిఆర్ఎస్ యువ నాయకులు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నల్లబెల్లి మండలంలోని రైతు ఆగ్రోస్ కేంద్రాలు మూతపడి ఉండడం వలన రైతులకు సబ్సిడీ ద్వారా వచ్చే యూరియాను విత్తనాలను పొందలేకపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. తక్షణమే ఆగ్రోస్ కేంద్రాలపై చర్య తీసుకొని లైసెన్స్ రద్దుచేసి అర్హులైన వారికి కేటాయించి రైతులకు నిరంతరం అందుబాటులో ఉండే విధంగా చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ యువ నాయకులు మేడిపల్లి రాజు గౌడ్ ,గుండాల సుమన్, తంగేళ్ల సురేష్, భరత్, మధు, మాటూరి హరీష్ ,తరుణ్, శ్రీకాంత్ ,తదితర యువ నాయకులు పాల్గొన్నారు.

