- భక్తిశ్రద్ధలతో గోమాల ధారణ అందరు ఆచరించాలి అంటున్న ట్రస్ట్ సభ్యులు.
మన ప్రగతి న్యూస్ /మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట ఋష్య ముఖ పర్వత పైన గోమాల ధారణ పోస్టల్ ఆవిష్కరణ చేసిన నేచర్ అనిమల్ కేర్ ట్రస్ట్ నిర్వాహకులు,గోమాత రక్షణ మరియు ప్రాముఖ్యతను చాటిచెప్పే గోమాత మాలాధారణ కార్యక్రమం రామకృష్ణాపూర్ శ్రీ సరస్వతి గోశాలలో ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తి శ్రద్ధలతో గోమాత మాలధారణ’కరపత్ర ఆవిష్కరణ ఋష్య ముఖ పర్వతం మీద వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో చేశారు. సనాతన ధర్మంలో గోవుకు ఉన్న విశిష్టతను చాటి చెప్పేందుకు రూపొందించిన “గోమాత మాలాధారణ” అవగాహన కరపత్రాన్ని స్థానిక ఆలయ ప్రాంగణంలో ఘనంగా ఆవిష్క రించారు.ఈ సందర్భంగా నిర్వహకులు మాట్లాడుతూ, గోసంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని,మాలాధారణ ద్వారా గోసేవ పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకు రావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కరపత్రంలో మాలాధారణ నియమాలు, గోపూజ ఫలితాలు మరియు గోశాలల ప్రాముఖ్యతను వివరించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఋష్య ముఖ పర్వతం కమిటీ సభ్యులు, పలువురు భక్తులు మరియు సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.


