Breaking News

సంక్రాంతి పర్వదినాన రంగవల్లుల పోటీలు..

  • మహిళల యొక్క ప్రతిభను వెలికి తీయడానికే రంగవల్లుల పోటీలు అంటున్న నిర్వాహకులు..

మన ప్రగతి న్యూస్ /మంచిర్యాల జిల్లా ప్రతినిధి:

మంచిర్యాల జిల్లా భీమారం మండలంలో రాదే కృష్ణ బలరామ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వెంచర్ స్థానిక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ముగ్గుల పోటీలు అత్యంత వైభవంగా జరిగాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా.. నిర్వహించిన ఈ పోటీల్లో మహిళలు,యువతులు ఉత్సాహంగా పాల్గొని, రంగురంగుల ముగ్గులతో ప్రాంగణాన్ని అలరించారు.ఈ పోటీల్లో పాల్గొన్న వారి సృజనాత్మకతతో అందరినీ ఆకట్టుకున్న గాజెంగి మౌనిక ప్రథమ బహుమతిని,రెండోవ బహుమతి క్యాతం భాగ్యలక్ష్మి గెలుచుకున్నారు.వీరిద్దరు వేసిన ముగ్గు తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉండటంతో పాటు రంగుల మేళవింపు అద్భుతంగా ఉందని న్యాయ నిర్ణేతలు ప్రశంసించారు.ముగ్గు ప్రత్యేకత వేసి అందులో సామాజిక సందేశాన్ని మేళవించారు.బహుమతి ప్రదానం విజేతలకు ముఖ్య అతిథి చేతుల మీదుగా జ్ఞాపిక మరియు నగదు బహుమతిని అందజేశారు. తన ప్రతిభను గుర్తించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ,గాజంగి రమాదేవి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక రాదే కృష్ణ బలరామ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వెంచర్ నాయకులు,మహిళా సంఘాల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని విజేతలను అభినందించారు.

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు