జాతీయ రోడ్డు భద్రత మహోత్స వాళ్లలో పాల్గొన్న. ఎస్సై బండి శ్రవణ్ కుమార్.
మన ప్రగతి న్యూస్/లింగాల గణపురం.
లింగాల గణపురం మండలంలో జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాలను పురస్కరించుకొని వరంగల్ సిపి సన్ ప్రీత్ సింగ్ డిసిపి రాజమహేంద్ర నాయక్ ఆదేశాల మేరకు లింగాల గణపురం ఎస్ఐ బండి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత కార్యక్రమం చేయడం జరిగినది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోయే వారి సంఖ్య క్యాన్సర్ వ్యాధి వల్ల చనిపోయే వారి కంటే ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. భారత ప్రభుత్వం రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తుంది అన్నారు జరుగుతున్న ప్రమాదాలలో 50% కంటే ఎక్కువ ప్రమాదాలు 35 ఏళ్లలోపు ఉన్న యువత వల్లే జరుగుతున్నాయి అన్న. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ముఖ్యంగా పాఠశాల విద్యార్థులపై దృష్టి పెట్టడం జరిగింది తద్వారా చిన్నతనం నుండే వారికి ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. రేపటి తరం భవిష్యత్తు విద్యార్థులు కాబట్టి రోడ్డు నియమాలను పాటిస్తూ తమ కుటుంబాలను కూడా సురక్షితంగా ఉంచుతారని నమ్మకంతో వారిని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశారు. భద్రత అంటే మన బాధ్యత ప్రమాదాలను నిర్వారిద్దాం మెరుగైన సమాజాన్ని నిర్మిద్దాం అని ప్రతిజ్ఞ చేయించారు. నెల్లుట్ల సర్పంచ్ నరసింగ రామకృష్ణ మాట్లాడుతూ రహదారి భద్రత కార్యక్రమంలో భాగంగా తన వంతు సహాయంగా 20 హెల్మెట్ సొంత ఖర్చులతో ఇప్పించడం జరిగింది ప్రయాణం సురక్షితంగా సాగడమే నా మొదటి ప్రాధాన్యత వాహనం నడిపేటప్పుడు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి కాళ్లలో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి మితిమీరిన వేగం సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ప్రాణాంతకం అని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా మీ ప్రాణాలకే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేయకండి రహదారి భద్రత అందరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దామెర కావ్య ప్రభాకర్ గ్రామ శాఖ అధ్యక్షుడు బత్తిని అశోక్ కుమార్ గౌడ్ గుర్రం బాలరాజు గౌడ్, వార్డు మెంబర్లు కత్తి శ్రీవాణి అజయ్ వేణు గౌడ్ కాంగ్రెస్ నాయకులు నర్సింగ ఎల్ల స్వామి కొయ్యడ సుమన్ గొర్రెల రమేష్ గౌడ్ మారబోయిన వేణు తదితరులు పాల్గొన్నారు.

