Breaking News

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అవగాహన సదస్సు

మన ప్రగతి న్యూస్/ దమ్మపేట :

కొత్త గూడెం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు దమ్మపెట పోలీసుల ఆధ్వర్యంలో మండలంలోని ముస్టిబండ గ్రామంలో రోడ్డు ప్రమాద నివారణ అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐ నాగరాజు, ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి మాట్లాడుతూ హెల్మెట్, సీటు బెల్టు ప్రాముఖ్యత, మద్యం సేవించి డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే అనర్ధాలను వివరించారు. గతంలో ముష్టిబండలో జరిగిన రోడ్డు ప్రమాద సంఘటనలను ఉదహరిస్తూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలను పాటించవలసిందిగా గ్రామస్తులను కోరినారు. అనంతరం గ్రామస్తులందరితో రోడ్డు భద్రత ప్రతిజ్ఞను చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు