మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని 15 నుండి 16 వరకు బమ్మెర గ్రామ శివారులో జరిగే ఆలేటి ఎల్లవ్వ జాతర పనులను మంగళవారం వర్ధన్నపేట ఏసీబీ అంబటి నరసయ్య సిఐ జానకిరామ్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీబీ నర్సయ్య మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఉత్సా కమిటీ సభ్యులకు సూచించారు. జాతరలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. తన వెంట దూలం పవన్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, సర్పంచ్ జిట్టబోయిన రమ్య ప్రశాంత్, బానోతు రమేష్ నాయక్, తదితరులు ఉన్నారు.


