మన ప్రగతి న్యూస్ / ఏన్కూర్
గత 35 సంవత్సరాలుగా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ రంగాల్లో సేవలందిస్తూ రెండున్నర లక్షల మందికిపైగా ప్రజలకు మార్గనిర్దేశం చేసిన ఖమ్మం జిల్లా వాసి డాక్టర్ గండు హరికిషోర్ గౌడ్‌కు ప్రతిష్ఠాత్మక స్వామి వివేకానంద జాతీయ ప్రతిభా పురస్కారం లభించింది.ఈ పురస్కార ప్రదాన కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త కోమటి జయరాం చౌదరి, ఎన్‌ఆర్‌ఐ టీడీపీ సెల్ కోఆర్డినేటర్ చప్పటి రాజశేఖర్, ఏపీ మీడియా అకాడమీ మాజీ కార్యదర్శి యం. బాలగంగాధర్ తిలక్, అంతర్జాతీయ కళావేదిక సీఈవో కత్తిమండ ప్రతాప్, పాన్ ఇండియా కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు అద్దంకి రాజా తదితరులు పాల్గొని డాక్టర్ గండు హరికిషోర్ గౌడ్‌కు పురస్కారాన్ని అందజేశారు.ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయనకు అభినందనలు తెలిపారు.


