Breaking News

రోడ్డు రహదారి భద్రత నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలి..

  • పరకాల సబ్ ఇన్స్పెక్టర్ రమేష్.

మన ప్రగతి న్యూస్/నడికూడ:

రోడ్డు రహదారి భద్రత నియమ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని పరకాల సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా.. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశానుసారం.. మంగళవారం నడికూడ మండలం కేంద్రంలోని గ్రామ పంచాయతీ వద్ద, రోడ్డు భద్రత యొక్క ప్రాధాన్యత పై స్థానిక యువత, విద్యార్థులు మరియు ప్రజలకు అవగాహన కల్పించారు. అతివేగం హానికరమ ని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కలిగే నష్టాల గురించి తెలియజేశారు. ద్విచక్ర వాహన దారులు తప్ప కుండా హెల్మెట్ ధరించాలని.. పిల్లలు (మై నర్) లకు వాహనా లు ఇవ్వకూడదని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించడంతో ప్రమాదాలను నివారించవచ్చునని అన్నారు. అలాగే మోటార్ వాహనాల చట్టం గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి సురక్షితమైన డ్రైవింగ్ తో తమ గమ్య స్థానాలకు చేరుకోవాలని అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడపరాదన్నారు. లేదంటే చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నడికూ డ సర్పంచ్ కుడ్ల మలహాల్ రావు, మాజీ సర్పంచ్ ఊర రవీందర్ రావు, నాయకులు దురిశెట్టి చంద్రమౌళి, నారగాని కుమారస్వామి, ఐలయ్య, నూతన వార్డ్ మెంబర్స్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు