Breaking News

విద్యార్థుల క్షేత్రస్థాయి పరిశీలన

మన ప్రగతి న్యూస్/ హనుమకొండ జిల్లా ప్రతినిధి:దామెర మండలంలోని కొగిలివాయి గ్రామంలో వ్యవసాయ కళాశాల వరంగల్ విద్యార్థులు సందర్శించడం జరిగింది. గ్రామ సర్పంచ్ చుక్క వనిత, ఉప సర్పంచ్ ప్రశాంత్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ కిషోర్ కుమార్, రైతులు వెంకన్న, సురేష్, గోల్కొండ శ్రావణ్, తేలిక సుధీర్,రంగారెడ్డి,రామకృష్ణ ఏఈఓ,కళాశాల విద్యార్థులు పాల్గొనడం జరిగింది. కళాశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని రైతులతో వారు చేస్తున్నటువంటి వ్యవసాయ పద్ధతులను మరియు యాజమాన్య పద్ధతులను తెలుసుకోవడం జరిగింది .దీనిలో భాగంగా వరి, మిరప పంట, మొక్కజొన్న మరియు పసుపు పంటలను సందర్శించి రైతులకు పలు సలహాలు సూచనలు చేయడం జరిగింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి. వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు పాటించి అధిక దిగుబడులు సాధించాలి అని తెలియజేయడం జరిగింది.

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు