-ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్
మన ప్రగతి న్యూస్//హనుమకొండ జిల్లా ప్రతినిధి :
:జాతీయ రహదారిలో భద్రత నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలని ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ఆర్రివ్ ఆలీవ్ కార్యక్రమాన్ని దామెర మండల కేంద్రంలో దామెర పోలీసుల ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ – ఆరివ్ ఆలీవ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్ ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్ ఐపీస్ మాట్లాడుతూ ప్రజలు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కలిగి ఉండాలన్నారు..రోడ్డు భద్రత యొక్క ప్రాధాన్యత ,మద్యం సేవించి వాహనాలు నడిపితే కలిగే నష్టాల గురించి,హెల్మెట్ యొక్క ప్రాధాన్యత గురించి తెలిపారు.. పరకాల ఏసీపీ సతీష్ బాబు మాట్లాడుతూ తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు డ్రైవింగ్ అనుమతి ఇస్తే జరిగే నష్టాల గురించి ఒక్కసారి ఆలోచించాలని అన్నారు…ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలు పాటించాలని,మోటారు వాహనాల చట్టం గురించి వివరించారు.
ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించినప్పుడే, రోడ్డు ప్రమాద రహిత రాష్ట్రాన్ని నిర్మించగలమని, రోడ్డు భద్రతను ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని ప్రజల భద్రతే మా బాధ్యత అని తెలిపారు.. కార్యక్రమంలో సిఐ రంజిత్ రావు, ఎస్సై కొంక అశోక్ సర్పంచ్ లు గరిగే కల్పన కృష్ణమూర్తి,పంచగిరి రాజు, ఒడ్డెపల్లి చంద్రం, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

