Breaking News

మహా వైభవంగా గోదాదేవి రంగనాయక స్వామి కళ్యాణం

మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:

మండల పరిధిలోని కనుముకుల గ్రామంలో గల శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం నాడు భోగి పర్వదినం పురస్కరించుకొని గో దాదేవి- రంగనాయక స్వామి కళ్యాణం మహా వైభవంగా జరుపబడింది. ఈ సంద ర్భంగా స్వామివారి- అమ్మవార్ల ఉత్సవ విగ్రహమూర్తులను కళ్యాణ మండపంలో ఎదు-రెదురు అదిష్టింపజేసి , వేదపండితులు వేదోచరణలు చేస్తుండగా భక్తజ ను ల జయ జయ ధ్వనుల మధ్య స్వామి- అమ్మవార్ల కళ్యాణం అంగ-రంగ వైభవం గా నిర్వహింపబడింది. ఈ కల్యాణోత్సవంలో ఆలయ నిర్మాణ కర్తలు పుష్పలత మల్లారెడ్డి ,ఆ గ్రామ ఉపసర్పంచ్ మైపాల్ రెడ్డి, ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అ సోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, మాజీ వార్డ్ మెంబర్ బాల్రాజ్, తదిత రులు పాల్గొన్నారు.

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు