Breaking News

అయ్యప్ప స్వామి మకర విలక్ ఊరేగింపు

మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:

భోగి పర్వదినం సందర్భంగా బుధవారం నాడు భూదాన్ పోచంపల్లిలో అయ్యప్ప స్వామి మకర విలక్ పట్టణ ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరింపజేసిన వాహనంపై స్వామివారి ఉత్సవ విగ్ర హాన్ని అధిష్టింపజేశారు. సన్నాయి మేళాలు మోగిస్తుండగా స్వామివారి ఆలయం నుండి ప్రారంభమైన ఊరేగింపు పట్టణ ప్రధాన వీధుల గుండా కొనసాగింది. ఈ కా ర్యక్రమంలో గురుస్వాములు తండ వెంకటేశం, బొడిగె బాబు ,లింగం, జగన్ తో పాటు శివకుమార్ ,సంజీవ, అయ్యప్ప స్వామి భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు