Breaking News

భోగి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్న ప్రజలు

పిల్లలకు రేగుపళ్ళు, పూలు పోసి ఆశీస్సులు తల్లిదండ్రులు

గ్రామాలలో భోగి మంటలు, ముగ్గులతో సంక్రాంతి సందడి

మనప్రగతిన్యూస్ /పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు

సంక్రాంతి పర్వదినాన్ని ముందు వచ్చే భోగి పండుగను మండలంలో పండగ వాతావరణంతో నిండిపోయింది. భోగి రోజు బుధవారం తెల్లవారుజామునే ప్రతి ఇంటి ముందర భోగి మంటలు వెలిగించి, పాత వస్తువులను మంటల్లో వేసి కొత్తదానికి స్వాగతం పలికారు. పిల్లలు, పెద్దలు కలిసి భోగి మంటల చుట్టూ చేరి పండగ ఆనందాన్ని పంచుకున్నారు.భోగి మంటల తర్వాత మహిళలు ఇంటి ముందు ముంగిటిని శుభ్రంగా కడిగి, అందంగా రంగురంగుల ముగ్గులు వేశారు. పూల ముగ్గులు, రంగుల ముగ్గులు, వేసి ఆవు పేడతో చేసిన బొబ్బెమ్మలు పెట్టి ధాన్యాలతో చేసిన ఆకారాలు వీధులను అందంగా తీర్చిదిద్దారు.కొన్ని చోట్ల మహిళలు, యువతులు కలిసి ముగ్గుల పోటీలు పెట్టి పండగ ఉత్సాహాన్ని మరింత పెంచారు. పెద్దలు మాట్లాడుతూ, భోగి మంటలు చెడును దూరం చేసి మంచిని ఆహ్వానించడానికని, ముగ్గులు ఇంటికి శుభం, సిరి సంపదలు తీసుకువస్తాయని చెప్పారు.భోగి మంటలు, ముగ్గులతో మండలం అంతటా సంక్రాంతి సందడి కనిపించి, గ్రామస్తులంతా ఆనందంగా పండగను జరుపుకున్నారు.సాయంత్రంవేళ పెద్దలు పిల్లలకు రేగుపళ్ళు, పూలు పోసి ఆశీస్సులు అందించినారు.